Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

.డబ్బుపంపకండి..అన్నదానంచేయండి.

శనిదోషనివారణ పూజలు



తెలుగు బాగర్ల సకు నమస్కారం. ఈనెల 17 శనివారం వచ్చె శని త్రయోదశి నాడు లోక క్షేమంకోసం జరిగే శని గ్రహ దోష నివారణమ రియుసాయంత్రం జరిగే శని ప్రదోష పూజ [రుద్రాభిసషేకం, శివార్చన] లలో తమపేర అర్చన చేయాలని చాలామ0ది కన్నారు. దీనికోసఁ డబ్బెలా పంపమ0 టారని ఫోన్ లో మెస్సేజ్ లలో అడుగుతున్నారు.
దయ చేసి మీరు ఈకార్యక్రమ0 కోరకు ఎటువంటి ధన సహాయము పంపవద్దు. మీగోత్ర నామాలు మెసేజ్ చేయండి చాలు.
ఈకార్యక్రమానికయ్యేఖర్చును "శ్రీ" పీఠమే భరిస్తుంది. సాయంత్రం ప్రదోషకాలమ్లో మీ పేర అర్చన జరుగుతుంది కనుక ఆ సమయమ్ లో "ఓ0 నమః శివాయ" అనేపచాక్షరిని 1008 సార్లు జ పించండి చాలు. మీరు స్నానంచేయటానికి వీలుపదకున్నా, ప్రయాన0 లో ఉన్నా మనస్సులో జపం సాగించండి. వీలైతే సాయత్రం మీకు వీలుంటే అన్నం కూర పాకెట్లుగా కట్టి బస్ స్టాండు, రైల్వే స్టేషన్/ మరెక్కడైనా ఆకలితో బాధ పడుతున్న జీవులకు అందించండి.అన్నదానానానికిసాటి మరేదీ కాద0టారు మహాత్ములు.



హరి సేవలో శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం నూజండ్ల మండలం గుంటూరు జిల్లా

మెయిల్: durgeswara@ webdunia.com cell 9948235641
నిరాకరణ