భక్తజనులకువందనం . అభయప్రదాయకుడైన ఆంజనేయస్వామివారి జయంతి[మే30]నాడు పీఠము లో క్షేత్రపాలకుడైన స్వామి వారికి విశేషపూజలు, జరగనున్నాయి. ప్రత్యేకించి హనుమాన్ చాలీసా పారాయణం తదనంతరం హోమము,జరుగుతాయి. కలియుగములో భక్తజనుల రక్షణ ధ్యేయంగా చిరంజీవి ఐనస్వామి అభయప్రదాతగానిలచియున్నారు. అనేక ఇక్కట్ల తో బాధపడేవారు ఆయనను ఆశ్రయించి తమబాధలు బాపుకుంటున్న నిదర్శనాలు మీఅందరూ ఎరిగినదే. మహాత్ములు ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పలుమార్గాలను మనకు దయతో చూపించారు. వారిలో శ్రీ తులసీదాసుగారు తమతపస్సంతా ధారబోసి రచించిన హనుమాన్ చాలీసా ను పఠించిన వారి రక్షణ
భారం తానే వహిస్తానని, స్వామి స్వయంగా వాగ్దానం చేసియున్నారు. ఆస్తోత్రమహిమ మీ అందరికీ తెలిసినదే. అందులోని ప్రతి దోహా ప్రత్యేకమయిన ఫలితాలనిచ్చే ఒక సంపుటీకరణ మంత్రమే . వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మాంత్రములలో శక్తిని తెలియజేసి వారిచేత ఉపాసన చేపించి ప్రయోగాత్మకంగా వారిబాధలను తొలగించుకొనుటలో సహాయ పడినాము. అదంతా స్వామి వారిశక్తి ,ఆఆర్తుల భక్తి మాత్రమేనని మనవి. మీకుకావాలంటే ఆభక్తుల అనుభవాలు వారిచేతనే తెలియజేపించగలము. ఇందులో అబద్దము అర్ధసత్యమేమీలేదు. కడుపునిండినవాడు మరొకరికిపెట్టకుండా దాచుకోవడం మహాపాపమని నమ్మి మహర్శులు ఇచ్చిన ఈ మహానిధిని అందరికి పంచడమనే సేవను సాధనగా ఎన్నుకుని మీసేవకునిగా, శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠ ప్రధాన సేవకునిగా, ఈ దైవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీతరపున ఆరోజుహోమములో ఆహుతులు సమర్పించడం జరుగుతుంది . ఇందుకుగాను మీరు మిమ్మలను బాధిస్తున్న సమస్య వివరిస్తూ, మీ గోత్రనామాలు తెలియజెస్తూ, మెయిల్ పంపితే మీరు పఠించవలసిన దోహా స్వామి అనుగ్రహంతో సూచిస్తాము.గోత్రము తెలియకపోయినా పరవాలేదు . ఫోన్ ద్వారానయినా సంప్రదించగలరు. ఇందుకొరకు మీరు ఆర్దికపరముగా ఏసహాయము మాకు పంపనవసరములేదు. మనసు నిండాస్వామిని నింపుకొని సేవించి మీబాధలు బాపుకొని మరికొందరికి మేలుచేయగలిగేశక్తిని సంపాదించుకోవడం[ఏ రూపేణాఅయినా] మాకిచ్చే తాంబూలము.దక్షిణ.మీరుమీజీవితములో ఎదుర్కుంటున్న ఎటువంటి కస్టాన్నయినాతొలగించుకోగలరునమ్మితే. మీరు మీకుతెలిసిన వారు ఎవరికైనా ఎంతమందికైనా ఈప్రసాదాన్ని పంచండి. " అసాధ్యసాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద, రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో" అని అంజని సుతుని వేడండి. నా అడ్రస్. బి.వి.బి. దుర్గేశ్వ రరావు.ప్రధానసేవకుడు,శ్రీ వేంకటేశ్వరజగన్మాత పీఠం, శ్రీచక్రవనం,రవ్వవరం ,గుంటూరు జిల్లా-522660 .........................................మెయిల్: durgeswara@webdunia.com,.....2...durgeswara@gmail.com cell:9948235641

లోడ్ అవుతోంది...