Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

శ్రీఆంజనేయం...1

హనుమన్మహిమలు

వందే రామదూతం
సకల సాంప్రదాయాలలో భగవంతుని కొలచే భక్తులరక్షాభారాన్ని స్వీకరించి న అభయ ప్రదాయకుడు ఆంజనేయుని మహిమలను అందరితో పంచుకునే సత్సంగమిది.
మా అమ్మగారు సంతానం కోసం ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం సింగర కొండ లో ప్రదక్షిణలు చేయగా స్వప్నము లో వాళ్ళ పెద్ద అన్నయ్య గారు గా కనపడి ఊయలను ప్రసాదించాడట. ఆతరువాత నేను కడుపున పడ్డానని మా అమ్మ ఇప్పటికీ అందరికీ ఆనందంగా చెబుతుంది. ఆవిధంగా స్వామి కృప నాజీవితాన్ని సృష్ఠించడంతోనే మొదలయింది. నేను పెరిగి పెద్దయ్యాక మాజేజినాయన గారి తదనంతరం శ్రీవేంకటేశ్వ ర జగన్మాత పీఠం సేవా భాగ్యందక్కడం ,ఇవన్నీ మరొకవ్యాస0 లో తెలియ జేసుకుంటాను. నాభార్య మొదటిసారి గర్భవతిగా నున్నప్పుడు ఆవిడ హస్తరేఖలు గమనించిన నాకు ఆందోళన కలిగింది. ప్రసవం చాలాకష్టమవు తుందని చెప్పడంతో శుభమా అని ఏ0 మాటలయ్యా? అని మాఅత్తగారు వాళ్ళు బాధ పడ్డారు. అనుకున్నట్లుగానే ప్రసవం చాలా కస్టమై0ది ఆ సమయమ0లోనేను వేరేవూర్లో చాలా దూరం లోఉన్నాను. విషయం తెలసి నా చేసేదేమీ లేక అక్కడనుండే స్వామిని రక్షించమని వేడుకుంటూ వున్నాను. ఇక్కడ సిజరియన్ చేసి బిడ్డను తీసారు. ఇద్దరూ క్షేమంగా గండం నుండి బయట పడ్డారు. రెండవసారి ఇంకా క్లిస్టమయిన పరిస్థితి తన ఆయుష్ రేఖ సగంవరకే ఉన్నది .అందులోనూ ఈవయస్సుకొచ్చేసరికి జీవితరేఖను ఖండన రేఖ ఒ కటి ఖండిస్తూ వున్నది. నేను పదేపదే చూడటం లెక్కలు వేయడంతో మా ఆవిడ నిజంచెప్పమని ఒత్తిడి చేయటంతో విషయం చెప్పడం, ఆవిడ మరింత విచారంతో బాధపడటం ఎక్కువయింది ఈవిషయానీ మాగురువుగారు భాస్కరుని ప్రకాశమయ్య గారివద్ద చెప్పగా ఆయన నాపై కేకలేసారు. మిడి మిడీ జ్గ్ణానంతో అంచనాలు వేయటమేనా అసలు ప్రమాదంగురించి సూచన చేయాలిగాని ఇలాచెప్పవచ్చా అని అని. సూర్యుని ఎండను ఎవడూ ఆపలేడు.కాని ఆఎండ నుండి రక్షించు కోవడానికి గొడుగు ఉపయోగ పడటమ్లేదా? కర్మ ఫలితం తప్పించ రానిదయితే మహర్షులు ఇన్ని శాస్త్రాలను , మంత్రాలను ఎందుకిచ్చారు? అని నామొద్దు బుర్రకు పనిపెట్టారు. తాడందించారు కదా! అందుకున్నాను. ఆర్తజన రక్షణ కోసం వున్నాడుకదా మన అంజప్ప. మా ఆవిడ చేత ఏ వ్రతాలు వుపాసనలు చేపించ వీలుకాదు కనుక ఆమె తరపున నేనే మంగళవారనియమాలతో మంత్రజపం ప్రారంభించి రక్ష రక్ష యని ప్రార్ధనలు చేసాను పొగిడితేచాలు ఉబ్బిపోయే శివాంశ సంభూతుడు కదా! అనుగ్రహించాడు. ఏ ప్రమాదం లేకుండా మారెండోవాడు పవన కుమార.ను ప్రసవించింది. నమ్మినవారికి సొమ్ము.........నమ్మలేనివారికిదుమ్ము. మరిన్ని లీలలు మరొకసారి చెప్పు కుందాం. నమస్తే వాయుపుత్రా.........

స్పందనలు

Re: ఆంజనేయ రక్ష 1
యత్ భావం తత్ భవతి.. అన్నారు పెద్దలు. అలాగే.. మీ అభిప్రాయం మీది. మీ నమ్మకాలు మీవి. ఎవ్వరు కాదన్నా అవునన్నా మీ భావాన్ని ఎవ్వరూ కాదనలేరుకదా. నిశ్చయంగా ముందుకు సాగి పోండి, పవనసుతుడు మీకు ఎల్ల వేళలా శుభం జరిగేలా ఆశీర్వదించాలని నా కోరిక.
Re: ఆంజనేయ రక్ష 1
చక్రవర్తి గారికి,గారికి ఈ బ్లాగ్గ్ ను చూసినందుకు ధన్యవాదములు. నమ్మకము అనేది వ్యక్తి మానసిక స్థితి పై ఆధార పడి ఉంటుంది. మరిసత్యం ... అది మనం నమ్మినా నమ్మకపోయినా ఒకేవిధంగా ఉం టుంది . మూర్ఖత్వంతో వాదించటం విప్లవ భావాలకు ప్రతీక అనుకున్న పసితనం నుంచి, అడుగడుగునా సత్యమేదో తెలుసుకునేలా నన్ను ఈ 40 సంవత్సరాల కాలం లో నడుపుతున్న భగవంతుని ప్రేమ ఆ లీలలు సత్యమో లేక నాలాంటి సాధారణ, జీవి మానసిక బలహీనతో నిర్ణయిం చడానికి . , కొద్దిగా ఓపికతో మరికొన్ని సంఘటనలు చదవండి.......... ధన్యవాదములు...దుర్గేశ్వరరావు
నిరాకరణ