ఊరంతా చెప్పినా వుత్తరం తలాపివద్దు
ఎందుకో?
ఏమిటండీ ఈ చాదస్తం ఇంకా ఈరోజులలో కూడా మీ మూఢనమ్మకాలు అని నన్ను తిట్టుకోకండి. వినదగు నెవ్వరుచెప్పిన అన్నారుగదా పెద్దలు . ఈ ఒక్క నిమిషానికి మీసమయమేమి వృధా కాదులెండి. చదవండి ప్లీజ్. మన ఇళ్ళలో పెద్దవాళ్ళెవరన్నా వుండి వుంటే [వాళ్ళను వృధ్ధాశ్రమాలకో శరణాలయాలకో తరిమెయ్య కుండా వుండి వుంటే] వాళ్ళు గొణుగుతూ వుంటారు. , ఒరేనాయనా వుత్తరం తలవుంచి నిదరపోకూడదురా వూరంతా చెప్పినా వుత్తరం తలాపి కూడదటరా.అని. మనమేమో విసుక్కుంటుంటాం. కానీ దీనిలో చాలా నిజంవుందండి.
భూమి వుత్తర దిశనుండి దక్షిణ దిసకు తిరుగుతూ వుంటుంది. అలాగే భూఅయస్కాంత క్షేత్ర ములో అయస్కాంత తరంగాలు వుత్తరమునుండి దక్షిణానికి నిరంతరము ప్రవహిస్తూ వుంటాయని మనం చదువుకున్నాం . మన శరీరములో కూడా రక్తప్రసరణ పైనుండి క్రిందకు యెక్కువగా ప్రవహించవలసి వున్నందున శరీర0 లోఅయస్కాంత ప్రవాహదిశ తలవైపు నుండి పాదాలవైపునకే సాగుతుంటుంది. మనము ఉత్తరము వైపుకు తలవుంచి నిద్రిస్తే మనతలలోనుండి పాదాలవైపుగా అయస్కాంత తరంగాల ప్రవాహం నిరాటంకముగా సాగుతుంది కనుక శరీర కణాలన్నీ విస్రాంతి లేకుండా రాత్రంతా అలసి పోతాయి .దానివలన మన ఆరోగ్యానికి హాని జరుగుతుంది. అదే అయస్కాంత ప్రవాహ దిశకు వ్యతిరేకంగా అంటే దక్షిణదిశవైపు తలనుంచితే రక్త ప్రవాహ దిశ భూ అయస్కాంత దిశకు వ్యతిరేకంగా ఉండటమువలన అయస్కాంత తరంగాల ప్రవాహం సాగదు. అందువలన శరీరకణాలు చక్కగా విశ్రాంతి తీసుకుంటాయి

లోడ్ అవుతోంది...